PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంపీపీ స్కూల్ ప్రహరీ గోడను తక్షణమే పూర్తి చేయాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: గోనెగండ్ల మండలంలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ ఆవరణ ప్రహరీ గోడను తక్షణమే పూర్తి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, మండల కార్యదర్శి నాగప్ప, మండల సహాయ కార్యదర్శి మునిస్వామి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లి గుండ్ల గ్రామంలో ఉన్న ఎంపీపీ స్కూల్ స్థలాన్ని బయట వ్యక్తులు ఆక్రమించకుండా స్కూల్ ప్రహరీ గోడ నిర్మించాలనీ అదే గ్రామానికి చెందిన కోటయ్య అనే వ్యక్తి ప్రహరీ గోడ ను కడుతుంటే అడ్డుకోవడం జరిగిందని అన్నారు.కాబట్టి సంబంధిత విద్యాశాఖ, ఎంపీడీవో, ఎమ్మార్వో,పోలీస్ శాఖల అధికారులు స్పందించి కోటయ్య అనే వ్యక్తిపై చర్యలు తీసుకుని ప్రహరీ గోడను తక్షణమే పూర్తి చేయాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని వారిచ్చరించారు. అనంతరం గ్రామ సిపిఐ నాయకులు శివ,దావీద్, హుస్సేన్, సుందర్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

About Author