ఆస్పత్రిలో ఎమ్మెల్యే రోజా
1 min read
నగరి: వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజా ఆస్పత్రిలో చేరారు. శస్త్ర చికిత్స కోసం ఆమె ఆస్పత్రికి చేరినట్టు ఆమె భర్త సెల్వమణి తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ఆడియో టేప్ రిలీజ్ చేశారు. రోజాకు రెండు మేజర్ ఆపరేషన్లు నిర్వహించారని ఆయన తెలిపారు. ఐసీయూ నుంచి ఈ రోజు వార్డు కు తరలించారు. ఈ క్రమంలో ఆమెకు రెండు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు ఆయన తెలిపారు. ఇది వరకే ఆమెకు ఆపరేషన్లు జరగాల్సి ఉందని, కరోన, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశారని సెల్వమణి తెలిపారు. అభిమానులు, పార్టీ నేతలు ఎవరూ కూడ ఆస్పత్రికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.