NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముల్లా తన్వీర్ కుమారుడి వివాహం ఘనంగా నిర్వహణ

1 min read

కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో

వైభవంగాశుభకార్యటిడిపి నాయకుల హాజరుతో వేడుకకు ప్రత్యేక ఆకర్షణ

నూతన దంపతులకు “షాదీ ముబారక్” తెలిపిన నాయకులు

ఈబీజీ గోవింద్ గౌడ్ కి శాలువాతో ఘన సన్మానం

హోళగుంద న్యూస్ నేడు: ముల్లా తన్వీర్  కుమారుడి వివాహ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఎంతో వైభవంగా, ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి గ్రామ ప్రజలు, ఆహ్వానితులు పెద్ద ఎత్తున హాజరై వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా నూతన దంపతులకు “షాదీ ముబారక్” తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ప్రేమ, ఆనందం, ఐక్యతతో నిండుగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే రెండు కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పవిత్ర బంధం చిరకాలం సుఖసంతోషాలతో కొనసాగాలని ఆశీర్వదించారు.అలాగే ఈ కార్యక్రమంలో ఈబీజీ గోవింద్ గౌడ్ ని శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. కార్యక్రమం మొత్తం ఆనందభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో ఈబీజీ గోవింద్ గౌడ్ , టిడిపి సీనియర్ నాయకులు పంపపతి , టిడిపి మండల అధ్యక్షుడు రఫీక్ , టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు వీరేష్ , సింధూలం మళ్లీ గోవర్ధన్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *