బాలింతలు, గర్భవతులు మంచి పోషకాహారంతో పాటు వ్యాయామం చేయాలి
1 min read

న్యూస్ నేడు పత్తికొండ: బాలింతలు గర్భవతులు మంచి ఆహారంతో పాటు వ్యాయామం అలవాట్లు అలవర్చుకోవాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ త్రివేణి సూచించారు.పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ మండలం పుచ్చకాయలపాడు గ్రామంలో గర్భవతులు బాలింతలు పిల్లల పోషణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, థీమ్ ప్రకారం ఆటలు కూడా మన జీవితంలో ఒక భాగమే అని, శారీరక వ్యాయామం, ఆటలు కూడా మనిషి దేహానికి అవసరమేనని అన్నారు.దానితోపాటుగర్భవతులు మరియు బాలింతలు అంగన్వాడి సెంటర్ లో ఇచ్చే సరుకులు తోపాటు వారు వారి ఆరోగ్యం కొరకు పండ్లు కూరగాయలు కూడా బాగా తీసుకోవాలని చెప్పారు. అలాగే 6నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు పిల్లలకు బాలమృతంతో పాటు గుడ్డు, పాలు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు. గర్భవతులు బాలింతలు తర్వాత పిల్లలు ఉన్న ఇండ్లలో వారితోపాటు వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరు పౌష్టికాహారాన్ని అనగా ఆకుకూరలు, కాయగూరలు బలాన్ని ఇచ్చే ఆహారాన్ని తినడం వల్ల పిల్లలు కూడా అదే అలవాటుని అనుకరిస్తారని అన్నారు. ఎందుకంటే పిల్లలలో అనుకరణ అనేది ముఖ్యమైన అభివృద్ధి కనుక ఇంట్లోని పెద్దవారుఎటువంటి ఆహారాన్ని తీసుకుంటారు పిల్లలు కూడా వాటినే అనుకరిస్తారు కనుక ఇంట్లో వాళ్ళందరూ కూడా మంచి ఆహారాన్ని తీసుకోవాలన అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ త్రివేణి తో పాటు అంగన్వాడీ టీచర్లు మాధవి, హైమావతి, శివ పార్వతి, సావిత్రి అంగన్వాడి హెల్పర్లు వన్నూరమ్మ, బి కాశమ్మ , వై.కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.

