ముసలోడినే జనం కోరుకుంటున్నారు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ‘‘జగన్ కన్నా… ముసలోడైనా చంద్రబాబే మేలని ప్రజలు అనుకుంటున్నారు. బాబునే వారు కోరుకుంటున్నారు. జగన్ బయటకు వస్తే షాపులన్నీ బంద్ చేయిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా షామియానాలు కడుతున్నారు. ప్రజలు జగన్‌ను చూసే పరిస్థితి లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ బురఖా వేసుకున్నట్లే’’ అని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎద్దేవా చేశారు.‘‘రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఒకే బోటులో పరిగెడుతున్నాయి. రెండు పార్టీలకు కార్యకర్తలు లేరు. నాయకులుగా మేమే కార్యకర్తలను కనపడనీకుండా చేశాం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యేల వెంట ఉంది కార్యకర్తలు కాదు. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, పోలీసులు మాత్రమే. అందుకే గడప గడపకు వైసీపీ అని కాకుండా… గడప గడపకు ప్రభుత్వం అని పేరు పెట్టారు. పోలీస్ అనే మహావృక్షం కింద వైసీపీ ఉంది’’ అని ప్రభాకరరెడ్డి విమర్శించారు.