నాగార్జున సంచలనం.. 1000 ఎకరాల అడవి దత్తత !
1 min read
పల్లెవెలుగు వెబ్: అక్కినేని నాగార్జున బిగ్ బాస్ షో వేదికగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బిగ్ బాస్ షోలోని తాజా ఎపిసోడ్ కు టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ రావును ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాగార్జున సంచలన నిర్ణయం తీసుకున్నారు. 1000 ఎకరాల ఫారెస్ట్ రిజర్వ్ ను దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అదే విధంగా వచ్చే మూడు వారాల్లో మూడు మొక్కలు నాటాలంటూ కంటెస్టెంట్లకు సూచించారు. ఇక ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన మొక్కను బిగ్ బాస్ హౌస్ లో నాటారు. పర్యావరణ పరిరక్షణ పై సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ.. ఆయన స్పూర్తిగా తాను కూడ పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.