ఏలూరు నగరపాలక సంస్థలో నమస్తే డే కార్యక్రమం
1 min read

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనివారికి పీపీ కిట్లు, యూనిఫామ్ లు భీమా కార్డు పంపిణీ
జీరో మరణాల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
నగర పాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : నమస్తే డే కార్యక్రమం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీల్లో పనిచేసే కార్మికులు ఆరోగ్యంగాఉంటూ జీరో మరణాల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ వారు ఆదేశానుసారం నమస్తే డే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చాంబర్లో నిర్వహించిన కార్యక్రమంలో మేయర్ నూర్జహాన్ పెదబాబు చేతుల మీదుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,సెప్టిక్ ట్యాంక్‌లు మీద పనిచేసే కార్మికులకు పీపీ కిట్లు,యాప్రాన్లు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ పెదబాబు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని యాప్రాన్సు,హెల్మెట్,షూ,చేతిగ్లౌజులు,మాస్క్,కళ్లద్దాలు మొదలైనవి అందించామన్నారు.వాటితో పాటు వారికి వృత్తిపరమైన ఫోటో గుర్తింపు కార్డులు,ఆయుష్మాన్ భారత్ బీమా కార్డులుఅందించామన్నారు. అదేవిధంగా వృత్తిపరమైన నైపుణ్యాన్ని పెంచే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్స్ కాకుండా కార్పొరేషన్ పరంగా వారికి రావలసిన అన్ని బెనిఫిట్స్‌ను అందజేస్తున్నామని అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రులు వారితో సంప్రదించిప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన టెస్టులతో పాటు క్యాన్సర్ సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ లు వారికి చేయించడం జరిగిందని మేయర్ నూర్జహాన్ పెదబాబు తెలిపారు. కమిషనర్ ఏ భాను ప్రతాప్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా హెల్త్ కవరేజ్ పొందవచ్చు అన్నారు కార్డు ఉపయోగించుకోవడం తెలియని వారు కార్పొరేషన్ లో సంబంధిత సెక్షన్ వారిని సంప్రదించి కార్డు ఉపయోగించుకోవాలని కమిషనర్ కోరారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జి చంద్రయ్య,ఎం.ఈ ఈ.సురేంద్రబాబు, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు,జిన్నూరు కనక నరసింహారావు,దేవరకొండ శ్రీనివాసరావు,కర్రీ శ్రీనివాసరావు,బత్తిన విజయ్ కుమార్,కల్వకొల్లు సాంబ,పాము శ్యామ్యూల్,ఈదుపల్లి పవన్,ఉత్సల సుజాతసన్నీ తదితరులు పాల్గొన్నారు.


