మృత్యులోను వీడని మూడు మూళ్ల బంధం
1 min read

మంత్రాలయం లో తీరని విషాదం
భార్య మృతి తట్టుకోలేక భర్త గుండెపోటుతో మృతి
మంత్రాలయం, న్యూస్ నేడు : మృత్యులోను వీడని మూడు మూళ్ల బంధం. మూడు మళ్లు వేసి కట్టుకున్న భార్య క్యాన్సర్ వ్యాధి తో మృతి చెందిన విషయం తెలుసుకున్న భర్త గుండెపోటుతో మృతి చెందిన విషాద కర సంఘటన నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రాలయం రామచంద్ర నగర్ లో నివాసం ఉంటున్న కమసలి మల్లికార్జున (70),నాగరత్నమ్మ (60)ఉంటున్నారు. భార్య నాగరత్నమ్మ గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధి తో భాదపడుతూ ఉండేది. ఆమే చికిత్స కోసం భర్త మల్లికార్జున (70) తనకున్న ఆస్తి అమ్మి చికిత్స చేయించారు. అయితే నయం కాక గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతు గురువారం మృతి చెందింది. ఇది తెలుసుకున్న భర్త మరణ వార్త విని విలపిస్తు గుండెపోటుతో అక్కడే మృతి చెందారు. ఇది తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తీరు చూపరులను కంఠతడిపెట్టింది. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు భార్య భర్త లు కలిసి వెళ్లే వారని స్థానికులు చర్చించుకుంటున్నారు .

