NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నందమూరి తారక రామారావు జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : బడుగుబలహీన వర్గాల అభ్యన్నతికి అశేష కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు దేశానికే ఆదర్శంగా నిలిచారని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై, నాగేశ్వరరావు కొనియాడారు. శుక్రవారం దివంగత నేత ఎన్టీఆర్​ జయంతిని పురస్కరించుకుని పార్టీ జిల్లా కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ స్టేట్​ సెక్రటరి వై. నాగేశ్వరావు మాట్లాడుతూ కరోన కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు బలి అవుతున్నాయన్నారు. జనవరిలో కేంద్రం ఇచ్చిన ఆక్సిజన్​ ప్లాంట్​ ఎందుకు నిర్మించలేదని, వ్యాక్సినేషన్​ ఆర్డర్​లో నిర్లక్ష్యం వహిస్తున్న వైసీపీ ప్రభుత్వం… వ్యాక్సింగ్​ కంపెనీలపై ప్రచారం, నిత్యావసర సరుకులు, పెట్రోల్,డీజిల్​ ధరలపై ఆసక్తి చూపుతోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులను ఇకనైనా మార్చుకోవాలన్నారరు. కార్యక్రమంలో స్టేట్ టిడిపి సెక్రెటరీ పోతురాజు రవి కుమార్, నాగేంద్ర, జేమ్స్ అబ్బాస్, హనుమంత్ రావు చౌదరి, భాస్కర్ రెడ్డి, బాలన్న స్వామి మొదలైన వారు టీడీపీనాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author