శంఖారావం కార్యక్రమంతో ప్రజలకు భరోసా కల్పించనున్న నారా లోకేశ్..
1 min read
కర్నూల్ టిడిపి ఇంఛార్జీ టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు శంఖారావం అనే కార్యక్రమానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ తెలిపారు. నగరంలోని మౌర్య ఇన్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో పర్యటించని నియోజకవర్గాల్లో శంఖారావం కార్యక్రమంతో ఆయన పర్యటిస్తారని చెప్పారు. 40 నుండి 50 రోజుల్లో 120 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లోకేశ్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తమ పార్టీ కార్యకర్తలు లోకేశ్‌కు మరింత చేరువై తమ అభిప్రాయాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ ప్రభుత్వంలో పెరిగిన ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగంతో యువత ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రానున్న తమ ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు.