జగన్ తో భేటీ పై నరేశ్ ఆసక్తికర కామెంట్
1 min read
పల్లెవెలుగువెబ్ : చిరంజీవి బృందం ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం పై ప్రముఖ నటుడు వీకే. నరేశ్ స్పందించారు. సీఎంను కలవడం మంచి పరిణామమని అన్నారు. ఫిల్మ్ ఛాంబర్‌తో సంబంధం లేకుండా వ్యక్తులను పిలిచి భేటీ జరపడం అప్రజాస్వామికం అని ఆయన పేర్కొన్నారు. ఛాంబర్ ఆధ్వర్యంలో అధికారికంగా ప్రజాస్వామ్యబధ్దంగా సామరస్యపూర్వక తీర్మానాలు, పరిష్కారాలు జరిగితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఐక్యతను చాటి చెప్పినట్లు ఉండేది. ఏదేమైనా త్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయిని ఆశిస్తున్నా’’ అని నరేశ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.