సైన్స్ తోనే దేశాభివృద్ధి సాధ్యం
1 min readఅన్నమయ్య జిల్లావిద్యాశాఖాధికారి వై.రాఘవరెడ్డి
పల్లెవెలుగువెబ్, అన్నమయ్య రాయచోటి:దేశానికి అవసరమైన భావి శాస్త్రవేత్తలను తయారుచేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని అన్నమయ్య జిల్లావిద్యాశాఖాధికారి వై. రాఘవ రెడ్డి అన్నారు. స్థానిక డైట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ గురువారం విజయవంతమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (అప్ కాస్ట్), జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 108 ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించగా 7 ఉత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపిక చేశారు. డీఈఓ మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞాన ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమన్నారు. పిల్లలలో దాగి ఉన్న సృజనాత్మకను వెలికి తీయడానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ సహకరిస్తుందని తెలిపారు. ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్తగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థుల శాస్త్రీయ సాంకేతిక, సామాజిక విషయాలపై అవగాహనకు సైన్స్ కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు. శాస్త్ర పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించటానికి ఇటువంటి కార్యక్రమాలు సహకరిస్తాయని తెలిపారు. విద్యార్థులు చక్కటి ప్రతిభను కనబరిచారని జిల్లా సైన్స్ అధికారి ఓబుల్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో డైట్ ఇంచార్జి ప్రిన్సిపాల్ శివభాస్కర్, జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రవీంద్ర రెడ్డి, జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా ఎన్.జి.సి. కోఆర్డినేటర్ చక్రధర్ రాజు, అసోసియేట్ జిల్లా సైన్స్ ఆఫీసర్ రామచంద్ర, డైట్ ఇంచార్జి ప్రిన్సిపాల్ శివభాస్కర్, ఎంఈఓ లు రమాదేవి, శ్యామల, రిసోర్స్ పర్సన్స్ బాబా ఫకృద్ధిన్, శివలక్ష్మి, ఆంజనేయులు, కిరణ్ చంద్రకుమార్, అన్వర్, వెంకటరమణ, మురళికృష్ణ, గైడ్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
విజేతలు వీరే…
నిహారిక గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్ మదనపల్లి, రేఖ ఏపీ మోడల్ స్కూల్ రాయచోటి, వర్షిణి జెడ్పీ హైస్కూల్ సంబేపల్లి, ఉమామహేశ్వరీ జెడ్పీ హైస్కూల్ లేబాక, మౌనిష ఏపీ మోడల్ స్కూల్ రాయచోటి, పూజిత కేజీబీవి వీరబల్లి, హేమంత్ కుమార్ రెడ్డి, జెడ్పీ హైస్కూల్ బురకాయల కోట వీరు ఈ నెల 9,10,11 తేదీలలో గూడూరు ఆది శంకర ఇంజినీరింగ్ కాలేజ్ లో జరగబోవు రాష్ట్ర స్థాయి పిల్లల సైన్స్ కాంగ్రెస్ లో పాల్గొంటారు అని తెలిపారు.