PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేషనల్ జనరల్ అవేర్నెస్ క్విజ్ కాంపిటేషన్

1 min read

పల్లెవెలుగు, వెబ్​ విజయవాడ: స్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియంలో నేషనల్ జనరల్ అవేర్నెస్ క్విజ్ కాంపిటేషన్ 2022 ప్రోగ్రామ్ ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ టీవీ నరసింహమూర్తి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యు జీనియస్ మేటటాలజీ ద్వారా పిల్లలందరికి బ్యాంకింగ్, ఫైనాన్స్ సిస్టమ్ గురించి అవగాహన కల్పించుట కొరకు వారికి క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ క్విజ్ పోటీలలో పాల్గొన్నవారిలో ఎక్కువ ప్రతిభ కనబరిచిన వారికి ఫ్రైజ్ లు ఇవ్వడమే కాకుండా నగదు ప్రోత్సాహం కూడా ఇవ్వడం జరుగుతుందని, విద్యార్థిని విద్యార్థులందరికీ, బ్యాంకింగ్ రంగంలోని అనేరకాలయిన సర్వీస్ లను నేర్చుకొనుటకు ఈ ప్రోగ్రామ్ ను యేర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ , విలేజ్ మరియు వార్డు సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఎస్.శన్ మోహన్ , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోనల్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

About Author