కర్నూలు, కడప, అనంతపురం కలుపుతూ జాతీయ రహదారి
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీలో మరో రెండు జాతీయ రహదారులకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ముద్దునూరు– హిందూపూర్ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించాలని నిర్ణయించారు. ఈ రహదారిని పులివెందుల, కదిరి మీదుగా హిందూపూర్ వరకూ 159 కి.మీ. మేర నిర్మిస్తారు. అందుకు రూ.1,600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రహదారి నిర్మాణానికి డీపీఆర్ వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు పావ్డ్ సోల్డర్స్ రహదారి నిర్మించాలని నిర్ణయించారు. 88 కి.మీ.మేర నిర్మించే ఈ రహదారి నిర్మాణానికి రూ.400 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు.