తెలుగు ప్రజలకు సేవ చేస్తానన్న నవనీత్ కౌర్
1 min read
పల్లెవెలుగు వెబ్ : మహారాష్ట్రలోని అమరావతి ఎంపీగా ఉన్న సినీనటి నవనీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. తెలుగు ప్రజల వల్లే తనకు పేరు వచ్చిందని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన ఎన్నిక వ్యవహారం పై బాంబే హైకోర్టు తీర్పు పై సుప్రీం కోర్టు స్టే ఇవ్వడంతో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, యువత, మహిళలకు సేవ చేస్తానన్నారు. దేశంలో కరోన తగ్గి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.