PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

త్వరలో మహానంది ఆలయ ఉద్యోగులకు నూతన పిఆర్సి

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది: త్వరలో మహానంది దేవస్థానంలో పనిచేసే ఆలయ ఉద్యోగులకు సంబంధించి నూతన పిఆర్సి ని అమలు చేయనున్నట్లు ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి గురువారం పేర్కొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అందరూ ఉద్యోగులు కలిసికట్టుగా పని చేశారని అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించారని వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మహానంది దేవస్థానంలో పనిచేసే ఏజెన్సీ సిబ్బందికి సంబంధించి వేతనాల్లో భాగంగా కేవలం 13 రూపాయలు గత కొన్ని నెలల క్రితం పెంచిన విషయం వాస్తవమేనని ఇది ఏమాత్రం వారికి సరిపోదని తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తో పాటు దేవాదాయ కమిషనర్ దృష్టికి తీసుకుని పోయి వీరి వేతనాలు పెంచడానికి కృషి చేస్తామన్నారు. గత ఏడాది మహాశివరాత్రి ఉత్సవాల్లో 51 లక్ష 82 వేల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ ఏడాది 54,69 వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు రూపాయలు ఆదాయం వచ్చింది అన్నారు. తాత్కాలిక షాపులు మరియు జాయింట్ వీల్ ద్వారా తొమ్మిది లక్షల 44 వేల 650 ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది మొత్తం మీద మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 6 లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందన్నారు త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే 50 వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనట్లు తెలిపారు. మహాశివరాత్రి మరియు ఉగాది పర్వదిన సందర్భంగా మహానంది ఆలయానికి డెకరేషన్ కొరకు తొమ్మిది లక్షలు టెండర్ ద్వారా వెచ్చించినట్లు తెలిపారు జెఎస్డబ్ల్యు మరియు దేవస్థానం ఆధ్వర్యంలో వాహనాల పార్కింగ్ మరియు మరికొన్నిచోట్ల దాదాపు 30 బాత్రూములు మరుగుదొడ్లను త్వరలో నిర్మించినట్లు తెలిపారు.. క్షేత్రంలోని ప్రధాన కోనేరులను త్వరలో ఆధునిక కరణ చేపట్టనున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలల క్రితం మహానంది దేవస్థానంలో పనిచేస్తూ బదిలీ అయిన నాగరాజుకు సూపరిండెంట్ హోదా కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

About Author