కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ గుర్తింపు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోన వైరస్ కొత్త వేరియంట్ డెల్టాక్రాన్ ను సైప్రస్ దేశంలో గుర్తించారు. దీనికి డెల్టా వేరియంట్ వంటి జన్యు నేపథ్యం ఉందని గుర్తించారు. దీనిలో ఒమైక్రాన్ రూపాంతరంలోని కొన్ని మ్యుటేషన్స్ కూడా ఉన్నాయి. అయితే దీని గురించి ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని.. ఆ దేశ మీడియా ఆదివారం ఈ వివరాలను వెల్లడించింది. సైప్రస్‌లో పరీక్షించిన 25 నమూనాలలో 10 ఒమైక్రాన్ మ్యుటేషన్స్ కనిపించాయి. ఈ వైరస్ సోకి, 14 మంది సాధారణ వ్యక్తుల నుంచి, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 11 మంది నుంచి ఈ శాంపిల్స్‌ను సేకరించారు.