లాభాల్లో నిఫ్టీ.. నష్టాల్లో బ్యాంక్ నిఫ్టీ !
1 min readపల్లెవెలుగు వెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. నిప్టీ 15500 మార్కును చేరుకుంది. సెన్సెక్స్ 55,000 మార్కును దాటింది. దీంతో సూచీలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. అనంతరం కన్సాలిడేట్ అయ్యాయి. నిప్టీ 16000, 16500 స్థాయి పైన నిలదొక్కుకుంటే.. 17000 స్థాయి వరకు ర్యాలీ కొనసాగే అవకాశం ఉందని, సెన్సెక్స్ 57000 స్థాయిని చేరుకునే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 55,564 స్థాయి వద్ద 127 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. నిప్టీ 16,550 వద్ద 21 పాయింట్ల లాభంతో కొనసాగుతోంది. బ్యాంక్ నిప్టీ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. 70 పాయింట్ల నష్టంతో 36,098 వద్ద ట్రేడ్ అవుతోంది.