డబ్బా పాలు వద్దు..తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం…
1 min read
పోషణ్ పక్వాడలో ఎమ్మెల్యే జయసూర్య..
నందికొట్కూరు, న్యూస్ నేడు: డబ్బా పాలు పిల్లలకు వాడటం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యపరంగా శ్రేష్టం ఉంటుందని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అన్నారు.శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని సీడీపీఓ కార్యాలయం ప్రాంగణంలో ఉదయం 11:45 కు ప్రారంభమైన పోషణ్ పక్వాడ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు.ముందుగా ఎమ్మెల్యే మరియు డీఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, రెండవ వార్డ్ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్,సీడీపీఓ కోటేశ్వరమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు. తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ గర్భవతులకు బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే ప్రతి ఒక్కటిని కూడా సక్రమంగా వినియోగించుకోవాలని వాటిని వృధా చేయవద్దని ఎమ్మెల్యే వారికి సూచించారు. గర్భవతులకు శ్రీమంతంతో ఎమ్మెల్యే ఆహ్వానం పలుకుతూ వారిని ఆశీర్వదించారు.వారికి పండ్లు గాజులు తదితర వాటిని అందజేశారు.అదే విధంగా గర్భవతులు బాలింతలు ఆరోగ్యపరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే వివరించారు.గ్రామాల్లో ఆరోగ్యపరంగా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి పల్లెలో వారికి అవగాహన కల్పిస్తూ ఉండాలని అన్నారు.తర్వాత సీడీపీఓ కోటేశ్వరమ్మ మాట్లాడుతూ పోషణ్ పక్వాడ కార్యక్రమం ఈనెల 22 వరకు జరుగుతుందని ప్రభుత్వ పరంగా ఏమైనా సదుపాయాలు వస్తున్నాయో వాటన్నింటినీ గ్రామాల్లో గర్భవతులకు బాలింతలకు చిన్నారులకు అందజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్ వైజార్లు వెంకటేశ్వరమ్మ,అనురాధ, శేషమ్మ,వరలక్ష్మీ,రేణుకా దేవి, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
