ఆ దేశంలోకి ‘నో ఎంట్రీ’ ..!
1 min readపల్లెవెలుగు వెబ్: కరోన వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఓమన్ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోకి విదేశీయుల్ని అనుమతించకూడదని ఓమన్ దేశ సుప్రీం కమిటీ నిర్ణయం తీసుకుంది. కరోన కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఓమన్ ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు విదేశీయులకు అనుమతి ఉండదని ఆ దేశ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. రంజాన్ సందర్భంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు నైట్ కర్ప్యూ విధించింది. కర్ఫ్యూ సమయంలో దుకాణ సముదాయాలు పూర్తీగా బంద్ చేయాలని స్పష్టం చేసింది. రంజాన్ సమయంలో మసీదులో నిర్వహించే తార్వీహ్ ప్రార్థనలు కూడ నిషేధించింది. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలు, రంజాన్ ఇఫ్తార్ విందులను కూడ బ్యాన్ చేసింది.