NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జానారెడ్డి స్వగ్రామానికి ‘నోఎంట్రీ ’..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డి నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య మృతితో నాగార్జున‌సాగ‌ర్ స్థానానికి ఉప ఎన్నిక వ‌చ్చింది. టీఆర్ఎస్ నుంచి నోముల న‌ర్సింహ‌య్య కుమారుడు నోముల భ‌గ‌త్ పోటీ చేస్తున్నారు. ఉపఎన్నిక‌ల్లో భాగంగా జానారెడ్డి స్వగ్రామం అనుమ‌ల‌కు టీఆర్ఎస్ నాయ‌కులు వెళ్లారు. దీంతో త‌మ గ్రామంలోకి రావొద్దంటూ కాంగ్రెస్ కార్యక‌ర్తలు అడ్డుకున్నారు. అంత‌కు మునుపు కాంగ్రెస్ నేత హాలియా వైపు వెళ్తుండ‌గా టీఆర్ఎస్ కార్యక‌ర్తలు ఇబ్బంది పెట్టారు. ఇది తెలుసుకున్న కాంగ్రెస్ కార్యక‌ర్తలు టీఆర్ఎస్ నేత‌ల‌ను గ్రామంలోకి రాకుండా అడ్డున్నారు. జానారెడ్డి కుమారుడు రావ‌డంతో ఉద్రిక్తంగా మారింది. జానారెడ్డి కుమారుడు జ‌య‌వీర్ రెడ్డి పోలీసుల‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో కొంత‌సేపు అక్కడ ఉద్రిక్తత‌కు దారి తీసింది.

About Author