మొదటిరోజు నామినేషన్లు ఖాళీ
1 min read
మున్సిపాలిటీ వద్ద భారీగా పోలీసుల బందోబస్తు..
నందికొట్కూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డులకు మరియు మున్సిపాలిటీ చైర్మన్ ను ఓటు ద్వారా ఎన్నుకునేందుకు మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల పర్వం నిన్నటి నుండి ప్రారంభమైంది.కానీ మొదటి రోజు నిన్న ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.నామినేషన్లను స్వీకరించేందుకు శుక్రవారం నుండి రేపు ఆదివారం వరకు మూడు రోజులు మాత్రమే ఎన్నికల అధికారులు గడువు ఇచ్చారు.నామినేషన్లు వేసేందుకు గాను దరఖాస్తుల కోసం నిన్న కార్యాలయానికి వివిధ పార్టీల నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్నవారు కార్యాలయంలో దరఖాస్తులను తీసుకెళ్లారు. మున్సిపాలిటీ కమిషనర్ వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయ ప్రాంగణం మరియు రోడ్డు వరకు లోపలికి వాహనాలు ఇతరులు రాకుండా బారికేడ్లతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
భారీగా పోలీసుల బందోబస్త్
మున్సిపాలిటీ కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారు.ఎలక్షన్ విధులపై వచ్చిన సీఐ శ్రీధర్ రెడ్డి,జూపాడుబంగ్లా ఎస్సై మల్లికార్జున,ఎస్సై సురేష్ కుమార్ మరియు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.


