రామ మందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరు !
1 min read
పల్లెవెలుగువెబ్ : రామమందిర నిర్మాణాన్ని ఎవరూ ఆపలేరని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలు కంటోందని, అది జరగని పని అని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన జన విశ్వాస్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. అఖిలేశ్ యాదవ్ అధికారంలోకి వస్తే రామమందిర నిర్మాణం ఆపేస్తామంటున్నారని, అది జరగని పని అని అన్నారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 300 పైగా స్థానల్లో గెలుస్తుందన్నారు.