అభివృద్ధిలో కాదు.. అప్పుల్లో మొదటి స్థానం !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం అభివృద్ధిలో కాకుండా.. అప్పుల్లో మొదటి స్థానంలో ఉందని ఏపీ బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలపై అధిక భారాన్ని వైసీపీ సర్కార్ మోపిందని ఆరోపించారు. రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు తెచ్చుకోవడం ఒక ఏపీలోనే ఉందని.. ఈ విషయంపై కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కూడా ప్రశ్నించారని పురంధేశ్వరి అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి చెప్పలేనంత దారుణంగా ఉన్నాయన్నారు. కేంద్రమంత్రి గడ్కరీ రోడ్లకు నిధులు ఇస్తే..రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గుప్పెడు మట్టి కూడా వేయలేదు విమర్శించింది.