వివేక హత్య కేసుతో సంబంధం లేదు.. ప్రమాణానికి సిద్ధం
1 min readపల్లెవెలుగు వెబ్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని నారా లోకేష్ మరోసారి స్పష్టం చేశారు. దేవుడు ముందు ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని, జగన్ ప్రమాణం చేయడానికి రాగలడా? అంటూ సవాల్ విసిరారు. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద ప్రమాణం చేయాడానికి సిద్దమయ్యాడు. చెక్ పోస్టు వద్ద టీడీపీ కార్యకర్తలతో కలిసి బైఠాయించాడు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. నేను అలిపిరి వద్ద ఉన్నాను. నాకు, నా కుటుంబానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదు. తాడేపల్లి నుంచి వైఎస్ జగన్ వచ్చి తనతో పాటు ప్రమాణం చేయగలరా? అంటూ ప్రశ్నించారు. వైకాపా నాయకులు దమ్ముంటే జగన్ ను తీసుకొచ్చి.. ప్రమాణం చేయించాలని సవాల్ విసిరారు. రెండు సంవత్సరాలు గడిచినా హంతకుల్ని పట్టుకోలేదని, సొంత బాబాయి హత్య చేయబడితే.. జగన్ కు పట్టదా ? అంటూ ప్రశ్నించారు.