తహసిల్దార్… ఎంపీడీవో కార్యాలయంలలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
1 min read
పాణ్యం , న్యూస్ నేడు: దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 102 జయంతి వేడుకలను స్థానిక తాసిల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయంలో తహసిల్దార్ నరేంద్ర నాథ్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ముందుగా వీరు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దేశంలోనే మొట్టమొదటిసారిగా రెండు రూపాయల కిలో బియ్యం ప్రవేశపెట్టి పేదల మనసు ఆకట్టుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు అని అన్నారు.రాజకీయ ప్రవేశం చేసిన 9 నెలల్లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అన్నారు.అనేక సంస్కరణలతో సంక్షేమ పాలన అందించారన్నారు.మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సిబ్బంది, గ్రామపంచాయతీ కార్యదర్శులు,వీఆర్వోలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.