PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్టీఆర్ మార్గ్.. హుస్సేన్ సాగ‌ర్ లోకి దూసుకెళ్లిన కారు

1 min read

పల్లెవెలుగు వెబ్​: హైద‌రాబాద్ లో ఓ కారు బీభ‌త్సం సృష్టించింది. ఖైర‌తాబాద్ నుంచి వేగంగా వ‌చ్చిన కారు ఎన్టీఆర్ మార్గ్ లోని హుస్సేన్ సాగ‌ర్ లోకి దూకింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. వాహ‌నంలో ప్ర‌యాణిస్తున్న ముగ్గురి యువ‌కుల్లో ఒక‌రికి చేయి విరిగింది. ఇద్ద‌రికి స్వ‌ల్ప‌గాయాల‌య్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. గాయ‌ప‌డిన వారిని సోమాజీగూడ య‌శోద ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. యువ‌కుల‌ను ఖైర‌తాబాద్ కు చెందిన నితిన్, స్ప‌త్రిక్ , కార్తీక్ గా పోలీసులు గుర్తించారు. కొత్త కారు నాలుగు రోజుల క్రిత‌మే కొన్నారు. ఖైర‌తాబాద్ నుంచి అప్ఝ‌ల్ గంజ్ కు టిఫిన్ చేయ‌డానికి వెళ్తున్న క్ర‌మంలో ఈ దుర్ఘ‌ట‌న చోటుచేసుకుంది.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author