పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు..
1 min read
ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించిన … కర్నూల్ డిఎస్పి జె . బాబు ప్రసాద్.
న్యూస్ నేడు కర్నూలు జిల్లా ప్రతినిధి : “తెలుగు ప్రజల కోసం పాలనాపరంగా పలు సామాజిక సంస్కరణలు, అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని, కర్నూల్ డిఎస్పి జె . బాబు ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ చలనచిత్ర నటుడు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి కర్నూల్ డిఎస్పి జె . బాబు ప్రసాద్పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కర్నూల్ డిఎస్పి జె . బాబు ప్రసాద్. మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలందించడంతో పాటు చలనచిత్రాల్లో, నిజజీవితంలోనూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు.ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ నారాయణ, ఏఆర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.