పారా మెడికల్ నర్సింగ్ కోర్సులకు అడ్మిషన్లు ప్రారంభం
1 min read– అమీలియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ చైర్మన్ సరళ, ప్రిన్సిపల్ శాంతి దమయంతి
పల్లెవెలుగు: అమీలియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్ లో పారా మెడికల్ నర్సింగ్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుచున్నాయని కళాశాల చైర్మన్ సరళ, ప్రిన్సిపల్ శాంతి దమయంతి పేర్కొన్నారు. బుధవారం అమీలియో హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం పారామెడికల్, నర్సింగ్ కళాశాలను నూతనంగా ప్రారంభించమన్నారు. డిఎంపిహెచ్ఎ, డిఎంఎల్ టి, డీఎంఐటీ, డీఆర్ జీఏ, డీఎంఎస్ టి, డీ ఏ ఎన్ ఎస్, డీసీఎల్ టీ, డీఆర్ టీ టీ, డీఓఎం, డీఓఏ తదితరు కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ కోర్సులు చదివినవారికి హెల్త్ కేర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, బయో మెడికల్ ఫైన్ ఇమేజింగ్ టెక్నాలజీ, స్కానింగ్, ఎక్స్ రే, అనేస్తీసియ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, కార్డియాలజీ టెక్నీషియన్, ఈసీజీ, రేడియో థెరపి టెక్నీషియన్, ఆప్తమెట్రిక్ అసిస్టెంట్, తదితర ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ఇంటర్ చదివి డాక్టర్ కాలేకపోయామనుకునే వారికి వైద్యులకు సహకారంగా ఉండే పారా మెడికల్ కోర్సులు అభ్యసించవచ్చన్నారు. ఇంటర్ లో బైపీసీ లేదా ఇతర గ్రూపులు, ఒకేషనల్, ఓపెన్ ఇంటర్ పూర్తి చేసిన వారు రెండు సంవత్సరాల పారామెడికల్ నర్సింగ్ కోర్సులు చేయుటకు అర్హులన్నారు. ప్రవేశాలు పొందుటకు ఈనెల 10 చివరి తేదీ అన్నారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తిస్తుందన్నారు. మేనేజ్మెంట్ కోటాలో ప్రవేశాలు పొందాలనుకునే వారికి ఈనెల 17 చివరి తేదీ అన్నారు. మరిన్ని వివరాలకు 9787010101 నంబర్ ను సంప్రదించాలన్నారు. సమావేశంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శైలజ, రమేష్, రాము పాల్గొన్నారు.