NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పౌష్టిక దాన పంపిణీ కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద  : హోళగుంద మండల పరిధిలోని నేరనికి గ్రామం లో రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆర్డీప్ సంస్థల ఆధ్వర్యంలో మేకలు, గొర్రెల పిల్లలకు దాన పంపిణి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ ఆర్డిప్ సంస్థ ప్రతినిధి నాగరాజు మాట్లాడుతూ మన దేశం వ్యవసాయం తో పాటు జీవనోపాధి కొరకు గొర్రెలు మేకలు పెంచుకోవడం లో కూడ అభివృద్ధి సాదించాలని తద్వారా మన యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని వీటిని గ్రామస్థాయిలోని రైతులు ఆలోచించాలని కోరారు అదేవిదంగా ప్రస్తుతం  మేకలకు గొర్రెలకు మేత కొరత ఉన్నందున కరువు పరిస్థితులు వలన రోగ నిరోధక శక్తి తగ్గి,పాల ఉత్పత్తి తగ్గుతుంది, సీజనల్ వ్యాధులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలని తెలియచేసారు.కాబట్టి పరిస్థితి లనుదృష్టిలో ఉంచుకోని ముందు గానే రిలయన్స్ ఫౌండేషన్ మరియు ఆర్థిప్ సంస్థ అవగాహనా మరియు శిక్షణలు  ఏర్పాటు చేసి మెలకువలు,జాగ్రత్తలు తెలియజేస్తున్నారు. రోగ నిరోధక పెంచాలని ఉద్దేశంతో  వాళ్లకి ఉచితంగా  దాన పంపిణీ చేయడం జరిగింది జరిగింది. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్థిప్ సంస్థ నాగరాజు తెలిపారు గ్రామ పశు సంరక్షణ సహాయకుడు మడివాలప్ప మాట్లాడుతూ  రైతులకు పోషణ విలువలు కూడిన దాన ఉచితంగ ఈ సీజన్లో చాలా అవసరము ప్రాముఖ్యము కూడా అని కొనియాడారు. నాగరాజు గారు ముగింపులో రైతులు పంటలలో పశువులలో చిన్న జీవాలలో సలహాలు సూచనల కొరకు రిలయన్స్ ఫౌండేషన్ టోల్ ఫ్రీ 18004198800 నెంబర్ ని సంప్రదించాలనీ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గ్రామ వెటర్నరీ సహాయకులు మడివాలప్ప, సోమన్న, ఆర్థిప్ నాగరాజు, మరి మల్ల, రవి, మల్లికార్జున రైతులు పాల్గొనడం జరిగింది.

About Author