PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్టోబర్ 1 న ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం

1 min read

అక్టోబర్ 1 న రాయలసీమ సాగునీటి ప్రస్తుత పరిస్థితిపై సదస్సు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం జరిగిన విషయం ఆంధ్రరాష్ట ప్రజానీకానికి విదితమేనని రాయలసీమ సాగునీటి సాధన     సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. శనివారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…ప్రత్యేక తెలుగు రాష్ట్ర సాధనకు రాయలసీమ మద్దతుకై కోస్తాంధ్ర నాయకులు రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడికను రాయలసీమ నాయకులతో చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. తదనంతరం రాయలసీమ హక్కుల పత్రం శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తితో  కోస్తా ప్రాంత, రాయలసీమ ప్రాంత నాయకులు భుజం భుజం కలిపి చేసిన పోరాటంతో అక్టోబర్ 1, 1953 ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన విషయం యావత్తు ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరు గుర్తుంచుకోవాల్సిన చారిత్రాత్మక అంశమని ఆయన తెలుపుతూ, ఇదే సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణకై అమరుడైన శ్రీపొట్టి శ్రీరాములు ని కూడా   స్మరించుకోవాలని ఆయన అన్నారు.శ్రీబాగ్ ఒడంబడిక స్పూర్తి ప్రధాతలు  కడప కోటి రెడ్డి (కడప), కల్లూరు సుబ్బారావు (అనంతపురం), ఎల్ సుబ్బరామి రెడ్డి (నెల్లూరు) బోగరాజు పట్టాబి సీతారామయ్య (కృష్ణా), కొండా వెంకటప్పయ్య (గుంటూరు), పప్పూరి రామాచార్యులు (అనంతపురం), ఆర్ వెంకటప్ప నాయుడు (నెల్లూరు) హాలహర్వి సీతా రామి రెడ్డి (కర్నూలు) గార్లను, తెలుగు రాష్ట్ర ఏర్పాటుకు అమరులైన పొట్టి శ్రీ రాములు గారిని స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని అక్టోబర్ 1 న జరుపుకుందామని ఆయన కోరారు.ఆంధ్ర రాష్ట్ర అవతరణకు మన పెద్దలు చేసిన ఒప్పందాలను  మనం గౌరవించాల్సిన భాద్యత ఉన్నదని, దీనిని  గౌరవించి అమలుకై   పాలకులకు విజ్ఞప్తి చేద్దామని ఆయన ప్రజలను కోరారు.ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంను నంద్యాల సంజీవనగర్ గేట్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు విగ్రహం దగ్గర అక్టోబర్ 1, 2023 ఉదయం 8 గంటలకు నిర్వహిస్తున్నట్లు బొజ్జా ప్రకటించారు‌.ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్వచ్చందంగా అక్టోబర్ 1, 2023  న తమ ఇళ్లలో/ఊరిలో/ బడిలో/గుడిలో/కార్యాలయంలో ఎక్కడో ఒకచోట అగర్ బత్తి / దీపం / క్యాండిల్ వెలిగించి / కొబ్బరికాయ కొట్టి లేదా ఏదో ఒక రూపంలో పై స్పూర్తి ప్రదాతలకూ  నివాళులు అర్పించవలసిందిగా దశరథరామిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు.రాయలసీమ సాగునీటి ప్రస్తుత పరిస్థితిపై విస్తృత స్థాయి సమావేశం తెలంగాణ విడిపోయిన పది సంవత్సరాల కాలంలో రాయలసీమ సాగునీటి ప్రస్తుత పరిస్థితిపై సాగునీటి సాధన సమితి ఆద్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం అక్టోబర్ 1, ఆదివారం, 2023 ఉదయం 10గంటలకు నేషనల్ పి జి కళాశాల, ఎన్ జి కాలని, నంద్యాల లో నిర్వహిస్తున్నట్లు దశరథరామిరెడ్డి తెలిపారు.ఈ‌ కార్యక్రమంలో  పట్నం రాముడు, కొమ్మా శ్రీహరి, భాస్కర్ రెడ్డి, రాఘవేంద్ర గౌడ్, షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు.

About Author