NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

13 న బలిజ సంఘం కార్తీక వనబోజనం

1 min read

– బనగానపల్లె ఎమ్మెల్యే కాటసానికి ఆహ్వానం
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె: పట్టణంలో పవిత్ర కార్తీక మసోత్సవాల్లో భాగంగా ఈ నెల 13న బనగానపల్లె శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న.కార్తీక వనభోజనానికి కాశయ్య తోట మంగళవారం ఉదయం బనగానపల్లి ఎమ్మెల్యే బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందచేశారు. ప్రతి ఏడాదిలాగే మండల స్థాయిలో బలిజ సంఘం కార్తీక వనభోజనం కార్యక్రమం నిర్వహిస్తున్నామని సంగం మండల అధ్యక్షుడు గోపినేని వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గతంలో బలిజ సంఘం సభ్యులకు ఇచ్చిన హామీ మేరకు యాగంటిలో అన్నదాన సత్రం కోసం స్థలం కేటాయిస్తానని అన్నారు. అదేవిధంగా పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ నుంచి పెట్రోల్ కొత్త పోలీస్ స్టేషన్ వరకు నిర్మాణము పూర్తి చేసుకున్న రహదారిలో డివైడర్ ఏర్పాటు చేస్తున్నామని ఆ ప్రాంతంలో ఒక ప్రదేశంలో శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాన్ని ఏర్పాటుచేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం పెద్దలు భానముక్కల సొసైటీ చైర్మన్ . నీలి శ్రీనివాసులు లక్ష్మయ్య ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author