16న’ గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టంపై వ్యాసరచన పోటీలు:
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: లైన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ఆధ్వర్యంలో 16న “గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టం” అనే అంశంపై జరగబోయే ప్రచార కరపత్రాలను ఆర్డిఓ కార్యాలయంలో పి సి అండ్ పిఎన్డిటి యాక్ట్ సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ ప్రవీణ్, మాస్ మీడియా అధికారి ప్రమీల, డిప్యూటీ మాస్ మీడియా అధికారి చంద్రశేఖర్, లయన్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రెటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, అడ్వకేట్ సుమలత, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాసులు, జేజేబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగ ముని, రెండవ పట్టణ ఎస్సై ఎంఏ ఖాన్, గైనకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ నర్మదాల సమక్షంలో విడుదల చేశారు. 11 నుంచి 14 సంవత్సరాల లోపు వారిని జూనియర్స్ గాను 14 సంవత్సరాల పైబడిన వారిని సీనియర్స్ గాను పరగనిస్తారన్నారు .వివరాలకు వెంకటరమణ కాలనీ మొదటి లైన్ లో ఉన్న నైస్ కంప్యూటర్ కార్యాలయంలో సంప్రదించి 11వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు.