13 న కురువల కార్తీక వనభోజనం
1 min readపల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో కురువ ల కార్తీక వనభోజనం నిర్వహిస్తున్నామని జిల్లా గౌరవ అధ్యక్షులు కే .కిష్టన్న ,జిల్లా అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు ,ఎం .కే .రంగస్వామి ,జిల్లా అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ,లు తెలిపారు.మంగళవారము సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశం లో జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు మాట్లాడుతూ కురువ సంఘం ఆద్వర్యం లో గత 19 సంవత్సరాలుగా కార్తీకవనభోజనాలు ఏర్పాటు చేశామని చెప్పారు .ఈ నెల 13 న జరిగే కార్తీక వనభోజన కార్యక్రమం పెద్దపాడు రోడ్ లోని మోడల్ స్కూల్ పక్కన శ్రీ బీరలింగేశ్వర స్వామి గుడి ఆవరణం లో ఏర్పాటు చేశామని ,ఈ కార్యక్రమము నకు జిల్లా లోని వివిధ మండలాల నుండి మరియు కర్నూలు నగరం లోని కులజులందరు కుటుంబ సమేతంగా హాజరు కావలెనని పిలుపునిచ్చారు .చిన్నారులకు ,మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తామని చెప్పారు .అనంతరం వనభోజనం నకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు .ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు బిల్డర్ వెంకటేశ్వర్లు ,టి .ఉరుకుందు ,కత్తి శంకర్ కోశాధికారి కే.సి .నాగన్న , ,టి .పాలసుంకన్న ,నగర అధ్యక్ష ,కార్యదర్శి తవుడు శ్రీనివాసులు ,బి .రామకృష్ణ బి .మల్లికార్జున ,కొండన్న ,మద్దిలేటి ,బి .బాలరాజు ,,రేమాట సర్పంచ్ పెద్ద వెంకన్న ,ఓర్వకల్ ,గొందిపర్ల మాజీ సర్పంచ్ లు కే .పెద్దయ్య ,కే .సోమన్న ,బి .బాలరాజు ,మిడుతూరు వెంకటరాముడు ,బి .బాలరాజుకే రాంగోపాల్ ,రాజు ,కే .వెంకటేశ్వర్లు ,కే .జయన్న తదితరులు పాల్గొన్నారు .