రోడ్డుపైనే… పంట నూర్పిళ్లు…
1 min read- కనిపించని పోలీసు చర్యలు…
పల్లెవెలుగు వెబ్, గడివేముల: నిబంధన పేరిట సవాలక్ష అనుమతులు కోరే పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాల అవగాహనపై మీనా మేషాలు వేస్తుండడం పై మండల వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే రహదారిని సగం రోడ్డుని ఆక్రమించుకొని పంట ఆరబతులు నిర్వహిస్తున్న రైతుల కు అవగాహన కల్పించేందుకు ముందుకు రాకపోవడం పంట ఆరబోసి తూకాలు వేసి అక్కడే మూటలు కట్టి లోడ్ ఎత్తుతున్నారు. మొక్కజొన్న కంకులు రోడ్డుపై వేసి నూర్పిళ్ళకు సిద్ధమవుతున్న స్పందించకపోవడంతో ప్రమాదాల బాధ్యత ఎవరు తీసుకుంటారని ద్విచక్ర వాహన దారులు ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. రోడ్డుపై రాళ్ళు పెట్టి అడ్డంగా వదిలేసి వెళ్లిపోతున్నా… కనీసం పట్టించుకునే నాధుడు లేడని వాహనదారులు, పాదాచారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోడ్డుపై గతేడాది ప్రమాదాలు జరిగాయని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పటికైనా పోలీస్ అధికారులు స్పందించి అవగాహన కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.