NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్.ఆర్.ఐ  కాలేజీలో శక్తి యాప్ పై ఒక్కరోజు అవగాహన కార్యక్రమం

1 min read

జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలతో విద్యార్థులకు అవగాహన

విద్యార్థులు భద్రతా చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

అదనపు ఎస్పి (అడ్మిన్) ఎన్. సూర్య చందర్రావు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు అదనపు ఎస్పీ అడ్మిన్  ఎన్.సూర్య చంద్రరావు  ఏలూరు ఎన్ ఆర్ ఐ  కాలేజీలో ‘శక్తి యాప్’ పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినారు.ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరులోని ఎన్.ఆర్.ఐ  కాలేజీలో విద్యార్థినుల కోసం ‘శక్తి యాప్’ మరియు మహిళా భద్రతపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎన్. సూర్య చంద్రరావు మరియు శక్తి టీమ్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులు చదువులో రాణించడానికి దృష్టి మరియు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో, భద్రత మరియు చట్టాలపై అవగాహన కూడా అంతే ముఖ్యమని అదనపు ఎస్పీ సూచించారు.మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి  “గుడ్ టచ్  బ్యాడ్ టచ్” అంశంపై ప్రత్యేక చైతన్య కార్యక్రమం నిర్వహించి, మహిళా రక్షణ చట్టాలపై వివరించారు. యాప్ యొక్క ప్రయోజనాలు  హెల్ప్‌లైన్ నెంబర్ లుఅత్యవసర పరిస్థితుల్లో యాప్ ద్వారా లేదా డయల్ 112 కు సమాచారం ఇస్తే, సమీప గస్తీ బృందం వెంటనే చేరుకుంటుందని తెలిపారు. శక్తి యాప్ నెంబర్ 7993485111 రాత్రివేళల్లో లేదా ఒంటరిగా ప్రయాణించేటప్పుడు భద్రతా భరోసా కల్పిస్తుంది. ఏలూరు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల వద్ద శక్తి టీమ్ సభ్యులు గస్తీ తిరుగుతూ, బాలికలను వేధింపుల నుంచి రక్షిస్తూ, యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ నాగమణి,అధికారులు,శక్తి టీమ్ సభ్యులు,ఎన్ ఆర్ ఐ  కాలేజ్ ప్రిన్సిపాల్ మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author