సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం వేధింపులు ఆపాలి
1 min read

నకిలీ మద్యంపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ కథనాలు రాస్తున్న సాక్షిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
సాక్షి ఎడిటర్ ధనుంజయ్ రెడ్డితో పాటు రిపోర్టర్‌లపై కేసులు పెట్టి వేధిస్తున్న కూటమి ప్రభుత్వం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం చేస్తున్న వేధింపులు ఆపాలని ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి మరియు స్థానిక జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్న కూటమి ప్రభుత్వ ఆగడాలు ఆపాలన్నారు. ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలని. పత్రికా స్వేచ్ఛను కాపాడాలంటూ రిపోర్టర్లు చేస్తున్న ధర్నా లో ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ యు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు పాల్గొన్నరు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇంచార్జీ మామిళ్ళపల్లి జయప్రకాష్ , రిపోర్టర్లకు మద్దతు తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి నగర అధ్యక్షులు గుడిదేసి శ్రీనివాసరావు,జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు నేరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయ నిర్మల,జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్,నగర క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు జెవియర్ మాస్టర్,జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, జిల్లా విభాగాల అధ్యక్షులు పల్లి శ్రీను, స్టాలిన్,రాష్ట్ర విభాగాల కార్యదర్శి లు భాస్కర్ల బాచి, దాసరి రమేష్ ,నగర విభాగాల అధ్యక్షులు ఏసు పాదం, ప్రత్తి పాటి తంబి, మేతర సురేష్ , కొల్లిపర భగవాన్,పిట్టా ధనుంజయ్, గణేష్, మట్ట రాజు, కొవ్వడ దుర్గారావు, పిల్లంగోళ్ళ సత్యదేవ్, సత్యనారాయణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

