NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కొనసాగుతున్న బేర్ పట్టు.. నష్టాల్లో సూచీలు

1 min read

పల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు నాలుగో రోజు కూడ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియ మార్కెట్లు కూడ అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు ఆరంభం నుంచే నష్టాల బాటపట్టాయి. ఒమిక్రాన్ కేసులు పెరగడం, అమెరికా నిరుద్యోగం మూడు నెలల గరిష్ఠానికి చేరడం, చమురు ధరలు పెరగడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య సమస్యతో పాటు.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు కూడ విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 589 పాయింట్ల నష్టంతో 58874 వద్ద, నిఫ్టీ 181 పాయింట్ల నష్టంతో 17575 వద్ద, బ్యాంక్ నిఫ్టీ 531 పాయింట్ల నష్టంతో 37319 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

       

About Author