PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఒకే ఒక జీవితం..

1 min read

సినిమా డెస్క్​: శర్వానంద్‌ కెరీర్‌‌లో రూపొందుతున్న 30వ చిత్రం ‘ఒకే ఒక జీవితం’. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా శ్రీ కార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌‌పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు, – ఎస్ ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పెళ్లి చూపులు’ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు. రీసెంట్‌గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా నిన్న ఈ సినిమాలో శర్వానంద్ పోషించిన ఆది పాత్రకి సంబంధించి ఒక స్నీక్ పీక్ ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో పాట పాడటానికి ఆదిని స్టేజ్ మీదకు పిలుస్తుండగా.. మరికొందరు వెళ్లి పాడమని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

About Author