కొప్పాకలో మాక్ ఎక్సైర్ సైజ్ డ్రిల్ నిర్వహణ
1 min read– ప్రతి ఏటా గ్యాస్ పైపులైన్ లీకేజ్ లు అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు..
– డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
– ఆర్ త్రినాధ రావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరెక్టర్ డిజాష్టర్ మేనేజ్ మెంట్ మరియు జాతీయ డిజాష్టర్ మేనేజ్ మెంట్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో అండర్ గ్రౌండ్ పైపు లైన్లు ద్వారా సరఫరా అవుతున్న సహజ వాయువు (మిథన్ ) గ్యాస్ పైపులైన్ లీకేజ్ లు, అగ్నిప్రమాదాలపై అవగాహన, అత్యవసర చర్యలు చేపట్టే అంశంపై మాక్ ఎక్సైర్ సైజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏలూరు ఆర్డీవో పెంచల కిషోర్ పాల్గొని లాంఛనంగా ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ పైపు లైన్ల కు కలిగే లీకేజి, అగ్నిప్రమాదాలు సంభవించే సమయంలో తలెత్తే పరణామాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఆయా శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలనేది అక్కడి ప్రజల పాత్ర వంటి విషయాలపై స్పష్టత కలిగించేందుకు ఈ మాక్ ఎక్సైర్ సైజ్ దోహదపడుతుందన్నారు. ఇటవంటి సంఘటనలు జరిగినపుడు ఏమేరకు అప్రమత్తంగా వ్యవహరిస్తామనే విషయం ఈ మాక్ ఎక్సైర్ సైజ్ ద్వారా అవగాహన కలుగుతుందన్నారు. గ్యాస్ పైప్ లైన్ లీక్ అయిన సందర్భంలో అనుసరించాల్సిన విధానంపై పైప్ లైన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ చేపట్టారు. పైపులైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారి ఆధ్వర్యంలో ఉదయం నుండి ఎక్కడైనా గ్యాస్ లీకేజీ జరిగిన వెంటనే అనుసరించాల్సిన విధానంపై వారు ప్రజలకు వివరించారు. గ్యాస్ లీకేజీ ప్రారంభం నుండి ఏ రకంగా దానిని అరికట్టవచ్చును అనే విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఆర్.త్రినాధ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్యాస్ లీకేజీ పై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఇటువంటి మాక్ డ్రిల్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని ఇటువంటి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని ఆయన అన్నారు. పెదవేగి మండలం కొప్పాక గ్రామంలో కంప్రెషర్ జీరో-2 ఉందన్నారు. అత్యవసర సంసిద్దత ప్రణాళికను సమీక్షించడం ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని మూల్యాంకనం చేయడం తద్వారా ప్రాణ ఆస్ది గురించి తెలుసుకుంటూ తమ విధులను సమర్ధ వంతంగా అందించడమే ఈ మాక్ డ్రిల్ యొక్క లక్షణమన్నారు. స్ధానిక ప్రజలు కూడా ఇందుకు సంబంధించిన అంశాలపై అవగాహన పరచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి మాల్యాద్రి, పొల్యూషన్ ఈఈ కె.వి. రావు, జిల్లా పరిశ్రమ శాఖ జనరల్ మేనేజర్ పి ఏసుదాసు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పూర్ణిమ, డిజాష్టర్ మేనేజ్ మెంట్ డిపిఎం సిహెచ్ రత్నబాబు, పైపులైన్ మౌలిక సదుపాయాల లిమిటెడ్ (పిఐఎల్) కొప్పాక మేనేజరు ఎస్ ఎ ఖాన్,గ్రామ సర్పంచ్ దీక్షితులు పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.