PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కైఫ గ్రామం లో గడప గడపకు మన ప్రభుత్వం

1 min read

– 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన బనగానపల్లె ఎమ్మెల్యే
పల్లెవెలుగు, వెబ్​ బనగానపల్లె : మండలం కైఫ గ్రామము లో గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంను బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు నిర్వహించారు. గ్రామంలోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పూలమాలతో సత్కరించి ఘన స్వాగతం పలికారు అనంతరం దర్గాలో ప్రత్యేక ఫాతిహాలు సమర్పించిన అనంతరం 35 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామి రెడ్డి గారు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు తన సొంత నిధులు ఐదు లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వివాహ వసతి గ్రౌండ్ ను ప్రారంభించారు. 5 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మినరల్ వాటర్ ప్లాంట్ ను భూమి పూజ నిర్వహించారు. అనంతరం జగనన్న మూడు సంవత్సరాల కాలంలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు ఇంటింటికి వెళ్లి వివరిస్తూ అలాగే అర్హులై ఉండి ఎవరైనా సంక్షేమ పథకాలు రానివారు ఉంటే వారికి సంక్షేమ పథకాలు అందించేటట్లు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఆదేశించారు. అలాగే గ్రామంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటూ గ్రామ ప్రజలతోనే స్వయంగా అడిగి తెలుసుకుంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కార్సన్ అనే రామిరెడ్డి గారు నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అనేది ఒక బృహత్తర కార్యక్రమమని ప్రజా సమస్యలను ప్రజలతోనే అడిగి తెలుసుకునే అవకాశాన్ని కల్పించినటువంటి మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎవరికి ఎంత లబ్ధి చేకూరుతుంది అనే క్షుణ్ణంగా వివరాలు తెలుసుకోవడమే కాకుండా ప్రజా సమస్యలను కూడా వారి నుంచి స్వయంగా అడిగి తెలుసుకోవడానికి ఈ గడప గడప కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి అనుహ్య స్పందన లభిస్తుందని జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలను పార్టీలకు కులాలకు మతాలకు అతీతంగా అందించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పారు. కరుణ కష్టకాలంలో కూడా జగనన్న ఇచ్చిన హామీలను సంక్షేమ పథకాలను అంత ఆర్థిక సంక్షోభంలో కూడా ప్రజలకు అందించడం జరిగిందని అలాంటి నిత్యం ప్రజల కోసం శ్రమించే నాయకుడు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని చెప్పారు. ఎన్నికలో ఎప్పుడు జరిగిన కూడా మన ముఖ్యమంత్రిని మళ్లీ అధికారంలో తీసుకురావడానికి మన అందరం కృషి చేస్తే సంక్షేమ పథకాలు అన్ని మనం ముంగిటకే వస్తాయని చెప్పారు.ఈ కార్యక్రమం లో కైఫ గ్రామ సర్పంచ్ కోగిల లక్ష్మమ్మ,ఉప సర్పంచ్ మొదుళ్ళ రేణుకా దేవి,ఎంపీటీసీ మొదుళ్ళ వెంకట సుబ్బమ్మ, వైయస్సార్ పార్టీ నాయకులు మొదుళ్ళ ప్రతాప్ రెడ్డి, సుబ్బరామిరెడ్డి,గంగినేని ప్రతాప్ యాదవ్,బోయ మధు, నడిపెన్న, కసి రెడ్డి,శ్రీనివాస రెడ్డి,వెంకట రెడ్డి,సుదర్శన్ రెడ్డి,సుబ్బరామయ్య,సత్యనారాయణ రెడ్డి,వెంకట రమణా రెడ్డి, బాసాని శంకర్ రెడ్డి,సుబ్బరాయుడు,సుధాకర్, సంజన్న,మహేష్,పుష్పరాజ్, శిఖామణి,భాస్కర్,హుస్సేన్ సాహెబ్,చిన్న మౌలాలి,శ్రీరాములు,షేక్ బాషా,లక్ష్మీపతి ఆచారి,ప్రసాద్ ఆచారి,మద్దిలేటి రెడ్డి,బడే బాషా,శివ గంగయ్య,వడిసెల సత్యం రెడ్డి,పురుషోత్తం రెడ్డి, వడిసేల రాం పుల్లారెడ్డి, సాదుల సత్యనారాయణ రెడ్డి, ఎం.శ్రీనివాస రెడ్డి, శివసేనా రెడ్డి,శంకరయ్య,రాముడు,గోపాల్,శివ శంకర్,ఈశ్వరయ్య,భాస్కర్, వడిసెల తిరుమలేశ్వర్ రెడ్డి, వడిసెల రుక్మధ రెడ్డి, సాదుల ప్రసాద్ రెడ్డి,రమేష్ సుధాకర్,మండల అభివృద్ది అధికారి శివరామయ్య,మండల అధికారులు,గ్రామ సచివాలయం సిబ్బంది,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

About Author