భారత త్రివర్ణ పతాకం చేతబట్టిన పాకిస్థాన్ విద్యార్థులు !
1 min readపల్లెవెలుగువెబ్ : దాయాది దేశం పాకిస్థాన్ విద్యార్థులు భారత త్రివర్ణ పతాకాన్ని చేతబట్టారు. ఉక్రెయిన్‌లోని వివిధ చెక్‌పాయింట్లను దాటుకుని పొరుగు దేశాలకు వెళ్ళిపోవడానికి పాకిస్థానీ, టర్కిష్ జాతీయులకు భారత దేశ జాతీయ పతాకం బాగా ఉపయోగపడిందని భారత విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్‌లో ఉంటున్న పాకిస్థానీ, టర్కిష్ పౌరులు ఆ దేశం నుంచి పొరుగు దేశాలకు వెళ్ళిపోయేందుకు చాలా శ్రమించవలసి వస్తోంది. భారతీయులకు అందిన సూచన వీరికి బాగా కలిసొచ్చింది. రొమేనియాకు చేరుకున్న భారతీయులు ఈ ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం ముమ్మరంగా కృషి చేస్తోంది. ‘ఆపరేషన్ గంగ’ పేరుతో చురుగ్గా వీరిని తీసుకొస్తోంది. స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిరిండియా, భారత సైన్యం విమానాలను పంపించి, భారతీయులను స్వదేశానికి రప్పిస్తోంది.