తల్లిదండ్రులు..అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలి
1 min read–నీటి వినియోగంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యం
– ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ ఎస్ కె. రుక్యాబేగం.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రతి తల్లిదండ్రులు వారి అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలని ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ ఎస్ కె. రుక్యాబేగం. కార్యక్రమానికి హాజరైన మహిళలకు సూచించారు.గురువారం కర్నూలు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల సందర్భంగా జోనల్ స్థాయి ‘నీటి వినియోగంలో మహిళల పాత్ర” వర్క్ షాప్ లో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.కె .రుక్యా బేగం పాల్గొన్నారు.ఐసిడిఎస్ ఆర్జెడి శ్రీమతి ఏ. పద్మజ, ఐసిడిఎస్ పిడి ఉమామహేశ్వరి, తదితరులు హాజరైనారు.ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి డాక్టర్ ఎస్ కె. రుక్యాబేగం మాట్లాడుతూప్రతి తల్లిదండ్రులు వారి అమ్మాయిలను అబ్బాయిలతో సమానంగా చదివించాలని ఒక్కరు తక్కువ ఒక్కరూ ఎక్కువ కాకుండా అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడ ఇంట్లో పనులు నేర్పించాలని అన్నారు.భారతదేశంలో వేద కాలం , పురాణ కాలాలలో మహిళలు అన్ని రంగాలలో గౌరవింపబడే వాళ్ళని, మధ్యయుగంలో మహిళల ప్రాధాన్యత తగ్గడం , అనంతరం మనకు స్వాతంత్రం వచ్చిన తరువాత బిఆర్ అంబేద్కర్ సమానత్వం కోసం రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్ మహిళల కోసం సమానత్వం కల్పించడంతో పురాణ , వేద కాలం నాటి మహిళలకు వున్న గౌరవం నేడు మహిళలకు దక్కుతున్నదని అన్నారు.మహిళలు ఆరోగ్య విషయాలపై దృష్టి పెట్టాలని అప్పుడే విద్యలోనూ, ఆర్థికంగా కుటుంబం , సమాజం బల పడుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడి ఇంటికే పరిమితం కాకుండా ఇంటి పనులతో పాటు ఆర్థిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల పని భారం పెరుగుతుందని అందుకే తప్పనిసరి మొదటి ప్రాధాన్యత మహిళలు ఆరోగ్యం పై శ్రద్ధ చూపాలని అన్నారు.ప్రస్తుత ప్రధాన సమస్య మహిళలలో గర్భిణీ స్త్రీలలో అధిక రక్తహీనత ఉంటుందని తప్పనిసరి ప్రభుత్వం అందిస్తున్న గోరుముద్ద పౌష్టికాహారం వంటివి పొంది బయటపడాలని సూచించారు. బాల్యవివాహాల వల్ల 16 సంవత్సరాల లోపు గర్భవతులు హై రిస్క్ గర్భవతులుగా నమోదవుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో బాల్యవివాహాలు వద్దని , దాచిపెట్టరాదని తల్లిదండ్రులకు సూచిస్తున్నామని అన్నారు. గత నాలుగు నెలలలో హై రిస్క్ గర్భవతులను ప్రసవ సమయానికి ఏడు రోజులు ముందే ప్రభుత్వమే ఆసుపత్రులకు తరలించి వైద్యం అందించడం వల్ల మరణాలు లేవని శుభపరిణామమని అన్నారు.నీటి వినియోగంలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యమైనదని ప్రతి మహిళ ఉదయం లేచినది మొదలుకొని నిద్రించే వరకు నీటితో అత్యవసరమైన పనులు ఉంటాయని వంటింట్లో వంట చేయడం మొదలుకొని బట్టలు ఉతకడం పరిశుభ్రమైన నీటిని త్రాగడానికి సేకరించడం చేస్తూ ఉంటారని వీటిని మనము ఎంత పొదుపుగా వాడితే అంత నీటి సంరక్షణ చేసిన వారమైతామన్నారు.
ఐసిడిఎస్ ఆర్జెడి శ్రీమతి పద్మజ మాట్లాడుతూమహిళలను ప్రోత్సహించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని పట్టణాలలో ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారని ఈ నీటిని వృధా చేయకుండా వాడుకోవాలని నీటిని పొదుపుగా వాడుతే నీటి వనరులను సంరక్షించిన వారం అవుతామని అన్నారు, నీటిని పంటలను పండించడానికి కూడా వినియోగిస్తామని, నీరు లేనిది మానవులు మానుగడ లేదని నీటి వనరులను పెంచుకోవలసిన బాధ్యత అందరిపై ఉన్నదని వర్షాలు సకాలంలో వర్షించాలంటే చెట్ల పెంపకం ఎంతో ముఖ్యమని కావున ప్రతి ఇంటి ఆవరణములోను రహదారులకు ఇరు పక్కల చెట్లను పెంచాలన్నారు. చెట్లు పెంచడం వల్ల ఆక్సిజన్ ప్రజలకు సమృద్ధిగా అందుతుంది వాయు కాలుష్యాన్ని నివారించిన వారమవుతామని కావున ప్రతి ఒక్కరు విరివిరిగా చెట్లు నాటాలన్నారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి వనరుల సంరక్షణ, నీటి వనరు వాడకంపై హాజరైన మహిళలకు క్షుణ్ణంగా తెలియజేశారు.అనంతరం హాజరైన మహిళల చేత నీటి సంరక్షణ పై కమిషన్ సభ్యురాలు ప్రతిజ్ఞ చేయించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్యామలాదేవి,కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్య సాయి జిల్లా, కడప, తిరుపతి, ఆరు జిల్లాల మహిళా అధికారులు, స్వచ్ఛంద సంస్థల మహిళలు, మహిళలు ఇతరులు పాల్గొన్నారు.