NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థిగా పి. రామచంద్రయ్యను గెలిపించండి           

1 min read

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడి

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఇండియా కూటమి బలపరుస్తున్న పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థిగా పి. రామచంద్రయ్య ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ప్రకటించారు. శుక్రవారం స్థానిక చదువుల రామయ్య భవనంలో ఏర్పాటుచేసిన ఇండియా కూటమి ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇండియా కూటమి లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ ఒక పార్లమెంట్ స్థానానికి ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నామని, అందులో పత్తికొండ నుండి పి. రామచంద్రయ్య ఎన్నికల బరిలో నిలుస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై  ఉద్యమాలు చేసేవారిని అసెంబ్లీకి పంపాలన్నారు. అసెంబ్లీ అభ్యర్థి పి.రామచంద్రయ్య మాట్లాడుతూ, పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేపట్టే వారిని ఆదరించాలన్నారు. జిల్లాలో పత్తికొండ నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతమని, గత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేసింది లేదన్నారు. సిపిఐ పోరాట ఫలితంగానే  హంద్రీనీవా ప్రాజెక్టు సాధించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత రైతులు టమోటా పంటను ఎక్కువ సాగు చేస్తారని, టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేవలం ఎన్నికల నినాదంగా మాత్రమే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసింది లేదన్నారు. ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేసే తనను ఆదరిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

About Author