సరస్వతీ పూజ నిర్వహించిన పవన్ కల్యాణ్
1 min read
పల్లెవెలుగువెబ్: శరన్నవరాత్రుల సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాదులోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో నేడు సరస్వతి దేవి పూజ నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన పవన్ కల్యాణ్ వేదపండితుల ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ ప్రణాళికలపై వారితో చర్చించారు. నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ పరంగా ఎలా ముందుకు పోవాలన్నదానిపై పలు సూచనలు చేశారు.