NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పేటీఎమ్ ఢ‌మాల్.. ఇన్వెస్ట‌ర్ల‌కు భారీ దెబ్బ

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పేటీఎం షేర్లు ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇన్వెస్ట‌ర్ల‌కు చుక్క‌లు చూపిస్తున్నాయి. వేల కోట్ల ఇన్వెస్ట‌ర్ల సంప‌ద ఆవిరైపోయింది. ఇప్ప‌టికే ఆల్‌టైమ్ గరిష్టస్థాయి నుండి 60 శాతనికి పైగా పడిపోయాయి. ఫిన్‌టెక్ మేజర్ పేటీఎం షేర్లు మూడు శాతానికి పైగా పతనమై, రూ. 728.50 వద్ద ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. బీఎస్‌ఈలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 50 వేల కోట్ల దిగువకు పడిపోయింది. పేటీఎం షేర్ ప్రస్తుతం… ఆల్‌టైమ్ గరిష్టం రూ. 1,961.05 నుంచి 63 శాతం దిగువన ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో క్రితం ముగింపు ధర రూ. 753.60 తో పోలిస్తే 0.7 శాతం క్షీణించి, రూ. 748.20 వద్ద ప్రారంభమైంది. మొత్తంమీద స్టాక్ డౌన్‌వర్డ్ ట్రెండ్‌లో ఉంది.

                                       

About Author