PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుల మతాలకు అతీతంగా ఘనంగా పీర్ల పండగ

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: కుల మతాలకు అతీతంగా మండలంలోని ఆళ్లగడ్డ గ్రామంలో ఆదివారం నాడు పీర్ల పండగ వేడుకలు గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. మౌలాలి పీర్ల స్వామికి గ్రామ వైసిపి నాయకులు రమణారెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి మరియు గ్రామస్తులు స్వామి వారికి ప్రత్యేక ఫాతిహాలు నిర్వహించి మొక్కుబడులు చెల్లించారు. కుల మతాలకు అతీతంగా గ్రామంలో ప్రతి ఒక్కరు మొహరం పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు వచ్చిన భక్తులకు గ్రామ పెద్దలు అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం నాడు పీర్ల స్వామివారికి ఏటికి తీసుకువెళ్లి ప్రత్యేక పాతహాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author