ఏలూరులో.. 2,30,857మందికి పింఛన్ పెంపు..
1 min read– పెంపుదల చేసిన పెన్షన్ రూ.2,750 అందజేత..
–అన్ని రకాల పెన్షన్లు మొత్తం 2,73,866 మందికి 75.89 కోట్ల రూపాయలు..
- జాయింట్ కలెక్టర్ పి. అరుణబాబు
పల్లె వెలుగు వెబ్, ఏలూరు: ఏలూరు జిల్లా లో 2,30,857 మందికి సంబంధించి పెన్షన్ రూ.2500 / – నుండి 2750 / రూపాయలకు పెంపుదల చేయడమే కాకుండా 8,092 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడము జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు చెప్పారు. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రీలో వైఎస్సార్ పెన్షన్ కానుక వారోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు,డి ఆర్.డి. ఏ పిడి ఆర్.విజయరాజు,ఏలూరు నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ బాపిరాజు, పలువురు పెన్షన్ దారులు,తదితరులు వీక్షించారు.అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కొత్తగా మంజూరీ అయిన వారికి జాయింట్ కలెక్టర్ పి.అరుణ్ బాబు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం పెంచిన పెన్షన్ కింద ఏలూరు జిల్లాలో 2,30,857 మంది వృద్ధాప్య, వితంతు, చేనేత, మత్స్యకార, కళ్లుగీత కార్మికులు, చర్మకారులు మరియు ఒంటరి మహిళలకు జనవరి 1 వ తేదీ నుండి పింఛన్లు రూ. 2500/- రూపాయలు నుండి రూ. 2750/- రూపాయలకు పెంపుదల చేయడమైనదని తెలిపారు. జిల్లాలో 2,30,857 మంది పెన్షన్లకు గాను పెంచిన మొత్తం కింద ప్రతి నెలా అదనంగా 6.34 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు . అదే విధంగా వీటితోపాటు జిల్లాలో మిగిలిన పెన్షన్ల తో కలిపి మొత్తము 2,73,866 మందికి 75.89 కోట్ల రూపాయలు జనవరి 1వ తేదీ నుండి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. డిఆర్ డిఏ పిడి ఆర్.విజయరాజు మాట్లాడుతు జిల్లాలో ఈరోజు నుంచి పెన్షన్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు .ఈ కార్యక్రమములో ప్రతి పెన్షన్ దారునికి పెన్షన్ తోపాటు ముఖ్యమంత్రి సందేశము వాలంటీర్ల ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు.కొత్తగా పెన్షన్ అయిన వారందరికీ పెన్షన్ పాస్ పుస్తకం, మంజూరి పత్రం, ముఖ్యమంత్రి వర్యుల సందేశము అందజేయడం జరుగుతుందన్నారు.