విమానం ఎక్కేందుకు జనం పరుగులు.. ఆక్రమణలో ఆఫ్ఘనిస్థాన్
1 min readపల్లెవెలుగు వెబ్ : ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు జనం బస్సు ఎక్కేందుకు పరుగులు పెడతారు. రైల్వే స్టేషన్ లో రైలు ఎక్కేందుకు పరుగులు పెడతారు. కానీ.. విమానం ఎక్కడం కోసం పరుగులు పెట్టడం చాలా అరుదైన సందర్భం. ప్రస్తుతం ఆఫ్గన్ లో ఇదే పరిస్థితి నెలకొంది. కాబూల్ విమానాశ్రయంలో విమానం ఎక్కేందుకు జనం పరుగులు పెడుతున్నారు. టికెట్ లేదు.. సెక్యూరిటీ లేదు. జనం మాత్రం రన్ వే మీద వేలాది గా విమానం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. తాలిబన్లు ఆఫ్గాన్ లోని కాబూల్ నగరాన్ని కూడ ఆక్రమించడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కాబూల్ వదిలి పారిపోయేందుకు విమానాశ్రయం వైపు పరుగులు తీస్తున్నారు. కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఓ సాధారణ బస్టాండ్ లా మారిపోయింది. దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారనే వార్తతో జనం హతాశులయ్యారు. ప్రాణాలు అరచేతపట్టి విమానాశ్రయం వైపు పరుగులు పెడుతున్నారు. ఒక్కో విమానం వద్ద వందలాది మంది జనం గుమిగూడిని వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.