సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
1 min read– సిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అలాగే తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సి హెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్ తెలిపారు, శుక్రవారం ఆయన స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆయుష్మాన్ భవ” కార్యక్రమంలో డాక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ, సీజన్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ సీజన్ వ్యాధులలో ఎక్కువగా విష జ్వరాలు, జలుబు, దగ్గు, కండ్ల కలక ఎక్కువగా రావడం జరుగుతుందని ఆయన తెలిపారు, ప్రజలు నీటిని వడగాచి చల్లార్చుకుని త్రాగాలని తెలిపారు, అంతేకాకుండా గ్రామాలలో తమ ఇండ్ల చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రపరచుకోవాలని తెలియజేశారు, ఎక్కడైనా నీటి కుంటలు ఉంటే అక్కడ మట్టి వేసి పూడ్చి వేయాలని తెలిపారు, అదేవిధంగా ఎప్పటికప్పుడు చేతులు శుభ్రపరచుకోవాలని ఆయన తెలిపారు, సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు డాక్టర్లు 24 గంటలు అందుబాటులో ఉంటారని, అలాగే అన్ని రకాల మందులు కూడా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలియజేశారు, ఇప్పటికే రోజుకు 250 మందికి పైగా ఓపికి రావడం జరుగుతుందని, ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లాల్సిన అవసరం లేదని, అన్ని రకాల మందులతో పాటు వైద్య సిబ్బంది అంతా కూడా అందుబాటులో ఉండడం జరుగుతుందని ఆయన తెలియజేశారు, ప్రజలు ప్రభుత్వ ఆరోగ్య సేవలు పొందాలని ఆయన అన్నారు, ఇప్పటికే గ్రామాలలో ప్రజలను అప్రమత్తం చేసేదిశగా వైద్య సిబ్బంది వారికి అవగాహన కల్పించడం జరిగిందన్నారు, గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు, ఏవైనా ఇతర ఆరోగ్య పరమైన సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే డాక్టర్లను సంప్రదించాలని ఆయన ప్రజలకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాగర్ కుమారి గైనకాలజిస్ట్, డాక్టర్ ముక్తియార్, డాక్టర్ దినకర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.